Sri Shanmukha Dandakam in Telugu Lyrics

See below for Sri Shanmukha Dandakam in Telugu Lyrics, Sri Subrahmanya Dandakam Stotram, Murugan Stotram in Telugu, Subrahmanya Swamy Daily chanting Sri Shanmukha Dandakam in Telugu Lyrics online free text.

Sri Shanmukha Dandakam in Telugu Lyrics

Shanmukha also known as Karthikeya, Murugan  and Subrahmanya. shanmukha is the Hindu god of war. lord, Subramanya Swamy is the son of Lord Shiva and Parvathi and the elder brother of Lord Ganesha. Lord Subramanya is Most popularly worshipped in South India, Sri Lanka, Singapore, and Malaysia as Murugan. Murugan is widely popular as the God of the Tamil people.

Download our App to Contact Purohit directly 

Check here for Tirumala Live Darshan Crowd Status

Sri Subrahmanya Swamy dandakam in telugu:

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే శివపార్వతీ ప్రియపుత్రాయ, నిన్నెంచ నేనెంత వాడన్, కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై, కార్తికేయుండవై, శివాహ్వానాన్ని మన్నించి, కైలాసమునకున్ బోయి దేవసైన్యాధ్యక్షుండవై, కీర్తిమంతుడవై, చిత్ర బర్హణవాహనుండవై, పార్వతీ పరమేశ్వరాశీస్సులన్ బొంది, కార్యసాధకుండవై, నీ వీరపరాక్రమంబులన్ జూపి అమరులకున్ అభయమున్నిచ్చిత్రైలోక్య పూజ్యుండవై, ముప్పది మూడు కోట్ల ద్వతలకున్నిష్ణుండవై, తారకాసుర సంహరివై, శోణిత పురంబువై దండయాత్రన్ ప్రారంభించి పురంబు ముట్టడించి, రణభేరుల్ మ్రోగించ, విశాఖునిన్ రాయబారిగా ఆ యసుర పురంబుజకున్ జంప, తారకాసురుండు రెట్టించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీదకున్ దండెత్త, మ నీవప్పుడే శివపంచాక్షరిన్ జపించి మంత్రించి, నీ దివ్య తేజంబుజన్ జూప తారకాసురుండచ్చెరువంద, అమితోత్సాహుండవై పాశుపతాస్త్రమున్ ప్రయోగింప, దైత్యులంతటన్ కకావికలైపోవన్నట్టి సమయంబునన్, తారకాసురన్, దృంచ, నా దుష్టుడన్ పునర్జీవించి బాధనొందింపగా, నాతని కంఠమునందున్న శివలింగమున్నీవు చ్చేదించి ఆ యసరునిన్ జంప, లోకంబులానందమై యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ బ్రసరింప వేల్పులందరున్ వేనోళ్ళ బొగడంగ త్రిమూర్తులన్ హర్షించి, మోదంబునన్ నీకు కళ్యాణమున్ జేయబోవంగ, దేవసేనిన్ బెండ్లాడి సుఖంబునుండన్ నీవు శ్రీ వల్లినిన్ జూచి మోహింప ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీ వల్లిన్నిచ్చి వివాహంబుజేయ, శ్రీ శివామోదంబుగా నిన్ను నే సేవించి నా కుజ దోష నివారణకున్ నిన్ ప్రార్థింప, ఆమోదంబు దేల్పినన్ బాయవే, అష్టైశ్వర్య సామ్రాజ్యముల్ గల్గవే నీవే సమస్తంబుగా నెంచి యీ దండకంబున్ పఠించుచున్ శివేశ్వరాయంచున్ శివతేజంబుజన్ వేల్గుదువో వీర సుబ్రహ్మణ్యేశ్వరా! నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహదోష నివారణన్ జేసి నీ దివ్య రూపంబునుం జూపి హృదయాంతరంగయటంచున్ నన్నేలు నా స్వామి ఓం సుబ్రహ్మణ్యేశ్వరా! తారకాసుర సంహారా! దేవసే శ్రీ వల్లీస నాథా! నమస్తే నమో కుజదోష నివారకాయ నమస్తే నమస్తే నమః

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!