Sri Lalitha Pancharatnam Lyrics in Telugu

See below for the Sri Lalitha Pancharatnam Lyrics in Telugu, Sri Devi Lalitha Pancharatna Stotram in Telugu

Sri Lalitha Pancharatnam Stotram is a daily chanting small and powerful stotram, Which starts with Pratha Smarami Lalitha vadanaravindam is the devotional mantra of goddess Lalitha Tripura Sundari and is composed by Sri Adi Sankara charya, The benefits of Sri Lalitha Pancha Ratna Stotram is described in the Phala Stuti and According to it those who worship goddess Lalitha by reciting the Pancha Ratna stotra will be blessed by the goddess with luck, prosperity, and fame.

Click here to Book Kukke Subramanya Ashlesha Bali Pooja

Click here to Book Kukke Subramanya Naga Prathista Pooja

Sri Lalitha Pancharatnam Lyrics in Telugu

ప్రాతః స్మరామి లలితావదనారవిందం

బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |

ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || 1 ||

 

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం

రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |

మాణిక్యహేమవలయాంగదశోభమానాం

పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || 2 ||

 

ప్రాతర్నమామి లలితాచరణారవిందం

భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |

పద్మాసనాదిసురనాయకపూజనీయం

పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || 3 ||

 

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం

త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |

విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం

విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ || 4 ||

 

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనా

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |

శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || 5 ||

 

యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |

తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా

విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||

Download our App to Contact Purohit directly 

Meaning of Sri Lalitha Pancharatnam Stotram:

దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు, చిరున్నవ్వు, కస్తూరి తిలకముతొ ప్రకాశించు నుదురు కలిగిన లలితా దేవి ముఖారవిందమును ప్రాతః కాలమునందు స్మరించుచున్నాను. |1|

ఏర్రని రత్నములు కూర్చిన ఉంగరములు ధరించిన వ్రేళ్లు అను చిగురుటాకులు కలదీ, మాణిక్యములు పొదిగిన కంకణములతొ శొభించుచున్నదీ, చేరకువిల్లు-పుష్పబాణము-అంకుశము ధరించినదీ అగు లలితాదేవి భుజములను కల్పలతను ప్రాతః కాలమునందు సేవించుచున్నాను. |2|

భక్తులకొరికలను ఏల్లప్పుడు తీర్చునదీ, సంసార సముద్రమును దాటించుతేప్పయైనదీ, బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడునదీ, పద్మము-అంకుశము-పతాకము-చక్రము అను చిహ్నములతొ ప్రకాశించుచున్నదీ అగు లలితాదేవి పాదపద్మమును ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను. |3|

వేదాంతములచే తేలియబడు వైభవము కలదీ, కరుణచే నిర్మలమైనదీ, ప్రపంచము యొక్క సృష్టి-స్థితి-లయలకు కారణమైనదీ,విద్యలకు అధికారణీయైనదీ, వేద వచనములకు మనస్సులకు అందనిదీ, పరమేశ్వరియగు లలితాభవానీ దేవిని ప్రాతః కాలము నందు స్తుతించుచున్నాను. |4|

ఒ లలితాదేవి| కామేశ్వరి-కమల-మహేశ్వరి-శ్రేఏశాంభవి-జగజ్జనని-వాగ్దేవత-త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతఃకాలము నందు జపించుచున్నాను. |5|

సౌభాగ్యము నిచ్చునదీ,సులభమైనదీ అగు లలితా పంచరత్నమును ప్రాతఃకాలము నందు ఏవడు పఠించునొ వానికి లలితాదేవి శీఘ్రముగా ప్రసన్ను రాలై విద్యను,సంపదను,సుఖమును,అంతులేని కీర్తిని ప్రసాదించును.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!