Sri Mrityunjaya Aksharamala stotram in Telugu

See below for Sri Mrityunjaya Aksharamala stotram in Telugu Lyrics online free, Sri Shiva Stotram, Sri Mrityunjaya stuti in Telugu Lyrics.

Sri Mrityunjaya Aksharamala stotram in Telugu Lyrics

Sri Mrityunjaya Aksharamala stotram in Telugu, Lord Shiva’s Mahamrityunjaya Mantra is a Sanskrit mantra that not only cures your physical well-being but also aligns your emotional and mental peace with your health. Mahamrityunjay mantra is one of the most powerful mantras that addresses Lord Shiva The mantra aims to ward off evils like jealousy and greed and promotes longevity of human lifeIdeally, for maximum benefits, the chant should be chanted 108 times. Now let us look into Sri Mrityunjaya Aksharamala stotram in Telugu.

Download our App to Contact Purohit directly 

Check here for Tirumala Live Darshan Crowd Status

Sri Mrityunjaya Aksharamala Stuti

శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర |

మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి

మృత్యుంజయా పాహి మృత్యుంజయా |

 

అద్రీశజాఽధీశ విద్రావితాఘౌఘ భద్రాకృతే పాహి మృత్యుంజయా |

ఆకాశకేశాఽమరాధీశవంద్యా త్రిలోకేశ్వరా పాహి మృత్యుంజయా |

ఇందూఫలేందుప్రభోత్ఫుల్ల కుందారవిందాకృతే పాహి మృత్యుంజయా |

ఈక్షాహతానంగ దాక్షాయణీనాథ మోక్షాకృతే పాహి మృత్యుంజయా |

ఉక్షేశ సంచార యక్షేశ సన్మిత్ర దక్షార్చితా పాహి మృత్యుంజయా |

ఊహాపథాఽతీతమాహాత్మ్యసంయుక్త మోహాంతకా పాహి మృత్యుంజయా |

ఋద్ధిప్రదాఽశేషబుద్ధిప్రతారజ్ఞ సిద్ధేశ్వరా పాహి మృత్యుంజయా |

ౠపర్వతోత్తుంగ శృంగాగ్రసంగాగహేతో సదా పాహి మృత్యుంజయా |

ఌప్తాత్మభక్తౌఘ సంఘాతి సంఘాతుకారిప్రహన్ పాహి మృత్యుంజయా |

ౡతీకృతానేకపారాది కృత్యంతనేయాధునా పాహి మృత్యుంజయా |

ఏకాదశాకార రాకేందుసంకాశ శోకాంతకా పాహి మృత్యుంజయా |

ఐశ్వర్యధామాఽర్కవైశ్వానరాభాస విశ్వాధికా పాహి మృత్యుంజయా |

ఓషధ్యధీశాంకభూషాధిపాపౌఘ మోక్షప్రదా పాహి మృత్యుంజయా |

 

ఔద్ధత్యహీన ప్రబుద్ధప్రభావ ప్రబుద్ధాఖిలా పాహి మృత్యుంజయా |

 

అంబాసమాశ్లిష్ట లంబోదరాపత్యబింబాధరా పాహి మృత్యుంజయా |

అస్తోకకారుణ్య దుస్తారసంసారనిస్తారణా పాహి మృత్యుంజయా |

కర్పూరగౌరాంగ సర్పాడ్య కందర్పదర్పాపహా పాహి మృత్యుంజయా |

ఖద్యోతనేత్రాగ్ని విద్యుద్గ్రహారక్ష విద్యోదితా పాహి మృత్యుంజయా |

 

గంధేభచర్మాంగ సక్తాంగసంసారసింధుప్లవా పాహి మృత్యుంజయా |

ఘర్మాంశుసంకాశ ధర్మైకసంప్రాప్యశర్మప్రదా పాహి మృత్యుంజయా |

 

ఙోత్పత్తిబీజాఽఖిలోత్పత్తిబీజాఽమరాధీశ మాం పాహి మృత్యుంజయా |

చంద్రార్ధచూడాఽమరేంద్రార్చితాఽఽనందసాంద్రా ప్రభో పాహి మృత్యుంజయా |

ఛందస్మిరోరత్నసందోహ సంవేద్య మందస్మితా పాహి మృత్యుంజయా |

జన్మక్షయాఽతీత చిన్మాత్రమూర్తే భవోన్మూలితా పాహి మృత్యుంజయా |

ఝణచ్చారుఘంటామణివ్రాతకాంచీగుణశ్రేణికా పాహి మృత్యుంజయా |

ఞిత్యష్టచింతాంతరంగ శ్రమోదాననాఽనందకృత్ పాహి మృత్యుంజయా |

 

టంకాతిటంకా మరున్నేత్రరంగాననా సంగతా పాహి మృత్యుంజయా |

ఠాళీమహాపాళికేళీ తిరస్కారి సత్కేలనా పాహి మృత్యుంజయా |

 

డోలాయమానాఽంతరంగీకృతాఽనేకలాస్యేశ మాం పాహి మృత్యుంజయా |

ఢక్కాధ్వనిధ్వానదాహధ్వనిభ్రాంతశతృత్వ మాం పాహి మృత్యుంజయా |

ణాకార నేత్రాంతసంతోషితాత్మ శ్రితానంద మాం పాహి మృత్యుంజయా |

తాపత్రయాత్యుగ్రదావానలాసాక్షిరూపాఽవ్యయా పాహి మృత్యుంజయా |

స్థాణో మురారాతిబాణోల్లసత్పంచబాణాంతకా పాహి మృత్యుంజయా |

దీనావనాద్యంతహీనాగమంతైకమానోదితా పాహి మృత్యుంజయా |

ధాత్రీపురాధీశపుత్రీపరిష్వంగచిత్తాకృతే పాహి మృత్యుంజయా |

నందీశవాహాఽరవిందాసనారాధ్య వేదాకృతే పాహి మృత్యుంజయా |

పాపాంధకారప్రదీపాఽద్వయానందరూపా ప్రభో పాహి మృత్యుంజయా |

ఫాలంబకానంతనీలోజ్జ్వలన్నేత్ర శూలాయుధా పాహి మృత్యుంజయా |

బాలార్కబింబాంశు భాస్వజ్జటాజూటికాఽలంకృతా పాహి మృత్యుంజయా |

భోగీశ్వరాఽనంతయోగిప్రియాఽభీష్టభోగప్రదా పాహి మృత్యుంజయా |

మౌళిద్యునద్యూర్మిమాలాజటాజూట కాళిప్రియా పాహి మృత్యుంజయా |

యజ్ఞేశ్వరా ఖండధజ్ఞానిధే దక్షయజ్ఞాంతకా పాహి మృత్యుంజయా |

రాకేందుకోటిప్రతీకాశలోకాదిసృడ్వందితా పాహి మృత్యుంజయా |

లంకేశవంద్యాంఘ్రిపంకేరుహాఽశేషశంకాపహా పాహి మృత్యుంజయా |

వాగీశవంద్యాంఘ్రిరుందారుమందార శౌరిప్రియా పాహి మృత్యుంజయా |

శర్వాఽఖిలాధార సర్వేశ గీర్వాణగర్వాపహా పాహి మృత్యుంజయా |

షడ్వక్త్రతాత త్రిషాడ్గుణ్య లోకాదిసృడ్వందితా పాహి మృత్యుంజయా |

సోమావతంసాంతరంగ స్వయంధామ సామప్రియా పాహి మృత్యుంజయా |

హేలానిగీర్ణోగ్రహాలాహలాసహ్య కాలాంతకా పాహి మృత్యుంజయా |

ళాణీధరాధీశ బాణాసనాపాప్త శోణాకృతే పాహి మృత్యుంజయా |

క్షిత్యంబుతేజో మరుద్వ్యోమ సోమాత్మ సత్యాకృతే పాహి మృత్యుంజయా |

ఈశార్చితాంఘ్రే మహేశాఽఖిలావాస కాశీపతే పాహి మృత్యుంజయా ||

మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి

మృత్యుంజయా పాహి మృత్యుంజయా |

 

ఇతి శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్

Leave a Comment

error: Content is protected !!