Sri Hayagriva Stotram in Telugu Lyrics

Sri Hayagriva Stotram in Telugu Lyrics Free Online

Among Desikan’s Stotras and philosophical works, Sri Hayagriva Stotram is the most powerful one. In Hinduism, Lord Hayagriva is viewed as a symbol of Lord Vishnu. He is loved and revered as the God of shrewdness and information, with a human body and a pony’s head, splendid white in variety, and situated on a white lotus. He is likewise viewed as what might be compared to Goddess Mata Saraswati. heck below for Sri Hayagriva Stotram in Telugu Lyrics.

Download our App to Contact Purohit directly 

Click here to book Pooja or Homam Online

He is praised in the Puranas for saving the holy Vedas from the evil spirits Kaitabha and Madhu and showing them again to Lord Brahma. In Tibetan Buddhism, He is a furious sign of the Bodhisattva of Compassion – Chenrezig. Dedication to and practice in view of His lessons is a quick strategy to beat negative powers and blocks. In Tibet, He was advanced particularly by prestigious Buddhist educator Atisa.

Sri Hayagriva Stotram by Vedantha Desikan

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥

 

స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం

సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం

అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం

హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ॥2॥

 

సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం

లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః

కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం

హరత్వంతర్ధ్వాంతం హయవదనహేషాహలహలః ॥3॥

 

ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాః

ప్రజ్ఞాదృష్టే రంజనశ్రీరపూర్వా

వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా

వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ॥4॥

 

విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం

విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం

దయానిధిం దేహభృతాం శరణ్యం

దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥5॥

 

అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః

అద్యాపి తే భూతిమదృష్టపారాం

స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ

కారుణ్యతో నాథ కటాక్షణీయః ॥6॥

 

దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః-

దేవీ సరోజాసనధర్మపత్నీ

వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః

స్ఫురంతి సర్వే తవ శక్తిలేశైః ॥7॥

 

మందోఽభవిష్యన్నియతం విరించః

వాచాం నిధేర్వాంఛితభాగధేయః

దైత్యాపనీతాన్ దయయైన భూయోఽపి

అధ్యాపయిష్యో నిగమాన్నచేత్త్వమ్ ॥8॥

 

వితర్కడోలాం వ్యవధూయ సత్త్వే

బృహస్పతిం వర్తయసే యతస్త్వం

తేనైవ దేవ త్రిదేశేశ్వరాణా

అస్పృష్టడోలాయితమాధిరాజ్యమ్ ॥9॥

 

అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోః

ఆతస్థివాన్మంత్రమయం శరీరం

అఖండసారైర్హవిషాం ప్రదానైః

ఆప్యాయనం వ్యోమసదాం విధత్సే ॥10॥

 

యన్మూల మీదృక్ప్రతిభాతత్త్వం

యా మూలమామ్నాయమహాద్రుమాణాం

తత్త్వేన జానంతి విశుద్ధసత్త్వాః

త్వామక్షరామక్షరమాతృకాం త్వామ్ ॥11॥

 

అవ్యాకృతాద్వ్యాకృతవానసి త్వం

నామాని రూపాణి చ యాని పూర్వం

శంసంతి తేషాం చరమాం ప్రతిష్ఠాం

వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞవాచః ॥12॥

 

ముగ్ధేందునిష్యందవిలోభనీయాం

మూర్తిం తవానందసుధాప్రసూతిం

విపశ్చితశ్చేతసి భావయంతే

వేలాముదారామివ దుగ్ధ సింధోః ॥13॥

 

మనోగతం పశ్యతి యస్సదా త్వాం

మనీషిణాం మానసరాజహంసం

స్వయంపురోభావవివాదభాజః

కింకుర్వతే తస్య గిరో యథార్హమ్ ॥14॥

 

అపి క్షణార్ధం కలయంతి యే త్వాం

ఆప్లావయంతం విశదైర్మయూఖైః

వాచాం ప్రవాహైరనివారితైస్తే

మందాకినీం మందయితుం క్షమంతే ॥15॥

 

స్వామిన్భవద్ద్యానసుధాభిషేకాత్

వహంతి ధన్యాః పులకానుబందం

అలక్షితే క్వాపి నిరూఢ మూలం

అంగ్వేష్వి వానందథుమంకురంతమ్ ॥16॥

 

స్వామిన్ప్రతీచా హృదయేన ధన్యాః

త్వద్ధ్యానచంద్రోదయవర్ధమానం

అమాంతమానందపయోధిమంతః

పయోభి రక్ష్ణాం పరివాహయంతి ॥17॥

 

స్వైరానుభావాస్ త్వదధీనభావాః

సమృద్ధవీర్యాస్త్వదనుగ్రహేణ

విపశ్చితోనాథ తరంతి మాయాం

వైహారికీం మోహనపింఛికాం తే ॥18॥

 

ప్రాఙ్నిర్మితానాం తపసాం విపాకాః

ప్రత్యగ్రనిశ్శ్రేయససంపదో మే

సమేధిషీరం స్తవ పాదపద్మే

సంకల్పచింతామణయః ప్రణామాః ॥19॥

 

విలుప్తమూర్ధన్యలిపిక్రమాణా

సురేంద్రచూడాపదలాలితానాం

త్వదంఘ్రి రాజీవరజఃకణానాం

భూయాన్ప్రసాదో మయి నాథ భూయాత్ ॥20॥

 

పరిస్ఫురన్నూపురచిత్రభాను –

ప్రకాశనిర్ధూతతమోనుషంగా

పదద్వయీం తే పరిచిన్మహేఽంతః

ప్రబోధరాజీవవిభాతసంధ్యామ్ ॥21॥

 

త్వత్కింకరాలంకరణోచితానాం

త్వయైవ కల్పాంతరపాలితానాం

మంజుప్రణాదం మణినూపురం తే

మంజూషికాం వేదగిరాం ప్రతీమః ॥22॥

 

సంచింతయామి ప్రతిభాదశాస్థాన్

సంధుక్షయంతం సమయప్రదీపాన్

విజ్ఞానకల్పద్రుమపల్లవాభం

వ్యాఖ్యానముద్రామధురం కరం తే ॥23॥

 

చిత్తే కరోమి స్ఫురితాక్షమాలం

సవ్యేతరం నాథ కరం త్వదీయం

జ్ఞానామృతోదంచనలంపటానాం

లీలాఘటీయంత్రమివాఽఽశ్రితానామ్ ॥24॥

 

ప్రబోధసింధోరరుణైః ప్రకాశైః

ప్రవాళసంఘాతమివోద్వహంతం

విభావయే దేవ స పుస్తకం తే

వామం కరం దక్షిణమాశ్రితానామ్ ॥25॥

 

తమాం సిభిత్త్వావిశదైర్మయూఖైః

సంప్రీణయంతం విదుషశ్చకోరాన్

నిశామయే త్వాం నవపుండరీకే

శరద్ఘనేచంద్రమివ స్ఫురంతమ్ ॥26॥

 

దిశంతు మే దేవ సదా త్వదీయాః

దయాతరంగానుచరాః కటాక్షాః

శ్రోత్రేషు పుంసామమృతంక్షరంతీం

సరస్వతీం సంశ్రితకామధేనుమ్ ॥27॥

 

విశేషవిత్పారిషదేషు నాథ

విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు

జిగీషతో మే కవితార్కికేంద్రాన్

జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః ॥28॥

 

త్వాం చింతయన్ త్వన్మయతాం ప్రపన్నః

త్వాముద్గృణన్ శబ్దమయేన ధామ్నా

స్వామిన్సమాజేషు సమేధిషీయ

స్వచ్ఛందవాదాహవబద్ధశూరః ॥29॥

 

నానావిధానామగతిః కలానాం

న చాపి తీర్థేషు కృతావతారః

ధ్రువం తవాఽనాధ పరిగ్రహాయాః

నవ నవం పాత్రమహం దయాయాః ॥30॥

 

అకంపనీయాన్యపనీతిభేదైః

అలంకృషీరన్ హృదయం మదీయం

శంకా కళంకా పగమోజ్జ్వలాని

తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్ ॥31॥

 

వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే

భిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః ।

అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్మాం

ఆవిర్భూయాదనఘమహిమామానసే వాగధీశః ॥32॥

 

వాగర్థసిద్ధిహేతోఃపఠత హయగ్రీవసంస్తుతిం భక్త్యా

కవితార్కికకేసరిణా వేంకటనాథేన విరచితామేతామ్ ॥33॥

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!